Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వరుస సెలవులతో తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

Huge rush in Tirumala due to three days holidays
Advertisement
  • నేడు గుడ్ ఫ్రైడే, రేపు రెండో శనివారం, ఎల్లుండి ఆదివారం
  • పూర్తయిన ఇంటర్ పరీక్షలు
  • తిరుమల కొండకు పోటెత్తిన భక్తులు
  • నిండిపోయిన క్యూ కాంప్లెక్స్ 
  • గోగర్భం డ్యామ్ వరకు భక్తుల క్యూలైన్
Advertisement
ఇవాళ గుడ్ ఫ్రైడే, రేపు రెండో శనివారం, ఎల్లుండి ఆదివారం... ఇలా వరుసగా మూడ్రోజులు సెలవులు రావడం, ఇంటర్ పరీక్షలు పూర్తి కావడంతో తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు. భారీ సంఖ్యలో భక్తుల రాకతో శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ నెలకొంది. 

సర్వదర్శనం టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. నారాయణగిరిలో ఏర్పాటు చేసిన షెడ్లు కూడా నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ గోగర్భం డ్యామ్ వరకు చేరుకుందంటే భక్తులు ఎంత భారీ సంఖ్యలో తరలి వచ్చారో అర్థమవుతోంది. టోకెన్ లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది.
Advertisement
Advertisement
Tirumala
Devotees
Holidays
TTD

More Telugu News